31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణయూత్ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి: దోనె అశోక్

యూత్ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి: దోనె అశోక్

యూత్ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి: దోనె అశోక్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 21 మే 2024

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ యువతి యువకుల బ్రతుకులలో ఎలాంటి మార్పు రాక “కొత్త సీసాలో పాత సారా అన్న మాదిరిగా ప్రభుత్వం యొక్క పరిపాలన వాగ్దానాలు ఉన్నాయని” తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోనె అశోక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర యువకులకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 4000 రూపాయలు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతీ యువకులకు ఉపాధి కల్పన చేపడతామని హైదరాబాదులోని సరూర్నగర్ స్టేడియంలో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పిసిసిగా ఉన్నటువంటి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోతున్నప్పటికీ యువకులకు పట్ల ఎలాంటి నిరుద్యోగ భృతి కానీ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ విడుదల చేయకుండా యువకులను మోసం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో యువ మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అందుకోసం 18 సంవత్సరాలు పైబడి చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందచేస్తామని డిక్లరేషన్‌ సభలో పేర్కొని యువతి యువకులకు మాయమాటలు చెప్పి ఓట్లు దండు కొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు యువకులను ఓట్లు వేసే యంత్రాల లాగే చూస్తున్నారు ఇది ప్రభుత్వాలకు తగదు అని హెచ్చరించారు. యువకులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది కావున రాబోయే రోజుల్లో ఇప్పటి ప్రభుత్వం తీవరపరినామలను ఎదురుకోవల్సి ఉంటుంది. ఇప్పటికైనా యువతి యువకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యువ డిక్లరేషన్ సభలో యువకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు యువకులకు నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి చెల్లించాలి అదేవిధంగా యువకులకు విద్యా ఉద్యోగ కల్పన కల్పిస్తూ ఈ సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి యువతి యువకులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూటర్లను పంపిణీ చేయాలని రాష్ట్ర యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో యువజన సంఘాల నాయకులు మల్యాల శేషు కుమార్, పుల్లూరి కనకయ్య, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్