31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణరికార్డుల తనిఖీ అనుమతికి దరఖాస్తు. 

రికార్డుల తనిఖీ అనుమతికి దరఖాస్తు. 

రికార్డుల తనిఖీ అనుమతికి దరఖాస్తు. 

సిద్దిపేట మార్చి 2 యదార్థవాది ప్రతినిధి:

సిద్దిపేట మున్సిపాలిటీ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు సంబదించి ఆర్టీఐ చట్టం ద్వారా  రికార్డుల తనిఖీ చేయడానికి కౌన్సిల్ ఫర్ సిటీజేన్ రైట్స్ సంస్థకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా ఆ సంస్థ ప్రతినిధిలు శ్రీనివాస్, గుండ్ల శివచంద్రంలు శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణికి దరఖాస్తు అందించారు. ఈ సందర్భంగా సీసీఆర్ సంస్థ జిల్లా అధ్యక్షులు గుండ్ల శివచంద్రం స్టేట్ మీడియా కో ఆర్డినటర్ సాజిద్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవకులని వారు పారదర్శకంగా ఉంటేనే ప్రజలకు అత్యుత్తమ సేవ అందించవచ్చన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందించాడనికే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాడానికి కౌన్సిల్ ఫర్ సిటీజేన్ రైట్స్ సంస్థ పనిచేస్తుందని ఆర్టీఐ చట్టం సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రం అని చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులను ప్రతి ఒక్క భారత పౌరులు తనిఖీ చేసుకునే అవకాశాన్ని భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ద్వారా  కల్పించిందని ఆయన  అన్నారు.

జిల్లా కలెక్టర్ ను కలిసిన సీసీఆర్ సంస్థ సభ్యులు..

సిద్దిపేట జిల్లాకు వచ్చిన నూతన కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని శనివారం కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం  సిద్దిపేట జిల్లాలో నిర్మితమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్లు ముంపునకు గురైన ప్రజలకు ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదని నాలుగు సంవత్సరాల నుండి కొంతమంది ఇంకా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల కోసం ఇతరత్రా పరిహారాల కోసం వేచి చూస్తున్నారని దీనిని త్వరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముంపు బాధితులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సంపత్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్