31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణరెసిడెనిన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ: మంత్రి పొన్నం 

రెసిడెనిన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ: మంత్రి పొన్నం 

రెసిడెనిన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ: మంత్రి పొన్నం 

మెదక్ యదార్థవాది ప్రతినిధి

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ తుప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి  సత్యనారాయణ.. స్కూల్ లో ఉన్న సమస్యల పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తుప్రాన్  రెసిడెన్షియల్ స్కూల్ లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూం గదులు ఒకే రూంలో  ఉండడంతో  అధికారులను పిలిపించి స్కూల్ సమస్యల పై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్కూల్ లో వాటర్ ప్లాంట్ మరమత్తుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా 50 వేల రూపాయలను పాఠశాల సిబ్బందికి అందించారు స్కూల్ లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులు కొంత మంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరా దిశారు వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణ బాబు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తో ఫోన్ లో స్కూల్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పాత 35 రెసిడెన్షియల్  స్కూల్ లో తుప్రాన్ స్కూల్ ఒకటి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ప్రతినిధ్యం వహించిన నియోజకవర్గం లో ఉన్న స్కూలు పరిస్థితి చూడడానికి ఆకస్మత్తుగా వచ్చానని అన్నారు. ప్రతీ స్కూల్ లో మార్పులు జరగాలి పాఠశాల భవిష్యత్ రూపు రేఖలు మార్చాలని ఆకస్మికంగా విజిట్ చేసానన్నారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తుప్రాన్ ఆర్డివో  జయచంద్ర రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దిన్ తహశిల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్