30.2 C
Hyderabad
Wednesday, June 12, 2024
హోమ్తెలంగాణరేపటి నుండి రూ. 500 కే వంట గ్యాస్: మంత్రి పొన్నం 

రేపటి నుండి రూ. 500 కే వంట గ్యాస్: మంత్రి పొన్నం 

రేపటి నుండి రూ. 500 కే వంట గ్యాస్: మంత్రి పొన్నం 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

రేపటి నుండి 500 కే గ్యాస్ పథకం అమలవుతుండడంతొ  మహిళలతో కలిసి వంట గ్యాస్ సిలిండర్ కి  పూలు వేసి  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీముల్లో భాగమైన మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని  200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కార్యక్రమం మా నాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి మంత్రులందరం కలిసి లాంఛనంగా ప్రారంబించుకుందం అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాగ్దానాలు అన్ని నెరవేరుస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య పద్ధతి లో చేసుకోవాలి అంతే కాని మేము ఇచ్చిన హామీలు వంద రోజులు కూడా పూర్తికాకముందే ప్రేరేపితమైన మాటలు ప్రభుత్వాలు కూలగొడతామనే మాటలు మాట్లాడుతూ గత ప్రభుత్వము ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆది మంచి పద్ధతి కాదని మా కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచం ఈరోజు మహిళలకు 500 రూపాయల కే సిలిండర్ అందిస్తుండడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని అక్క చెల్లెమ్మలు ఈ కార్యక్రమాలను  విస్తృతపరచుకుంటున్నారని మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని దేవాలయాలకు, హాస్పిటలకు ఉచితంగా స్వేచ్ఛగా వెళ్తున్నారన్నారు. ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న బండి సంజయ్ ని అడుగుతున్న మీ ప్రభుత్వం 500 కే సిలిండర్ ఇవ్వగలుగుతుందా…? 500 సిలిండర్ 1200 కు పెంచారు ప్రజలకూ మీరు ఏం జవాబు చెబుతారు అంటూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలని 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న మాట్లాడకుండా ఎన్నికలు వస్తున్నాయని రామాలయం పేరు మీద ఓట్లు అడిగితే కాదు మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లు అడగాలి..తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం కొట్లాడారని ప్రశ్నించారు. 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్