25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణల్యాండ్ రెగ్యులేషన్ స్కీంపై బీఆర్ఎస్ పోరు బాట

ల్యాండ్ రెగ్యులేషన్ స్కీంపై బీఆర్ఎస్ పోరు బాట

ల్యాండ్ రెగ్యులేషన్ స్కీంపై బీఆర్ఎస్ పోరు బాట

* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా..

* నెరవేర్చలేని హామీలు ఇచ్చి.. చేతులెత్తేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..

* కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

* హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్

హుస్నాబాద్ మార్చ్ 6 యదార్థవాది ప్రతినిధి:

ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కి నిరసనగా బీఅర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ధర్నాలో పాల్గొన్న హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఖజానా నింపుకోవడానికి మాత్రమే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తులను ముందేసుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఒక మాట ఇది కాంగ్రెస్ కే సాధ్యమైందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గ  పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్