30.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణవింజపల్లిలో దారుణం

వింజపల్లిలో దారుణం

వింజపల్లిలో దారుణం

* తమ్ముని నరికి చంపిన అన్న

* సాగు నీటిపై వివాదం

హుస్నాబాద్ మార్చ్ యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా కోయిడ మండలం వింజపల్లి గ్రామానికి చెందిన కొమ్ముల  తిరుపతిరెడ్డి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి మధ్యన తరచుగా భూతగాదాలు వస్తుండేది తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములులో భావి మాత్రం ఒకటిగా ఉన్నందున ఇద్దరి మధ్యన నీటి పంపకం విషయంలో గొడవ జరుగుతూ ఉండేది.. మంగళవారం వ్యవసాయ బావి వద్ద గొడవ తార స్థాయికి చేరుకున్నది..  సుమారు రెండు గంటల అందాజులో అన్నదమ్ముల ఇద్దరికి నీటి విషయమై గొడవ జరిగి పక్కనే ఉన్న గొడ్డలితో మెడపై రెండుగాట్లు గొంతుపై మూడు ఘాట్లు వేసి  తమ్ముడిని తీవ్రంగా గాయపరిచడు. దీంతో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి మూడు సంవత్సరాలు అమ్మాయి రెండు సంవత్సరాల వయసు వారు ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్