31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణశంబుదేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

శంబుదేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

శంబుదేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

కొండపాక యదార్థవాది

మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో మహిమన్వితమైన శైవ క్షేత్రం స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ పాలకమండలి సభ్యుల చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని తెలిపారు. ఫిబ్రవరి 5, 6 , 7 తేదీలలో జరిగే వార్షిక  బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చివరి రోజు ఏడవ తేదీన శివపార్వతుల కళ్యాణం నిర్వహించిన అనంతరము మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి వడ్లకొండ శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులు నర్రా రాఘవరెడ్డి నూనె కుమార్ యాదవ్ మంచాల కృష్ణమూర్తి అమిరిశెట్టి వెంకటేశం వెంకటరమణ దేశాయిరెడ్డి గోనె శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు మధు పంజా అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్