29.7 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణసిఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి.

సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి.

సిఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి.

కొండపాక యదార్థవాది

కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బారాస కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల అవమానంకరంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ రండ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ మాటలని వెంటనే వెనక్కి తీసుకుని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని లేని పక్షం లో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి ప్రాణాన్నీ సైతం ఫణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అని నినాదంతో ఆమరనా నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన పోరాట యోధుని పట్ల ఒక రండ అనే పదం తో కించపరిన పద్ధతి బాగోలేదన్నారు.ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను మభ్యపెట్టి అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడం చేతకాక ప్రజల దృష్టి మరల్చెందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం లో భాగంగానే కేసీఆర్ పై అవాకులు చేవాకులు పేలుతున్నాడన్నారు. నోటికొచ్చినట్లు కేసిఆర్ పై దుర్భాషలాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని రానున్న రోజుల్లో రేవంత్ ని కాంగ్రెస్ పార్టీని ప్రజలు గ్రామాల పొలిమేరలు దాటి దాకా తరిమికొడతారని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్