28.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణసిద్దిపేట మార్కెట్ కమిటీ, చైర్మన్ రేసులో మాజర్ మాలిక్.?

సిద్దిపేట మార్కెట్ కమిటీ, చైర్మన్ రేసులో మాజర్ మాలిక్.?

సిద్దిపేట మార్కెట్ కమిటీ, చైర్మన్ రేసులో మాజర్ మాలిక్.?

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో  సిద్దిపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ జిల్లా చైర్మన్ మజర్ మాలిక్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లాలో ఖాళీ గా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం జిల్లా నాయకులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుల వద్ద ఫైరవీలు నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక మార్కెట్ కమిటీ పదవిని కూడా చాలా మంది కాంగ్రెస్ జిల్లా నాయకులు ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం లో లేకున్నా కాంగ్రెస్ పార్టీని వీడకుండా గత ప్రభుత్వం పై ప్రజల తరపున   పోరాడుతూ  ఉద్యమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటున్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వింగ్ జిల్లా చైర్మన్ గా ఉన్న   మజర్ మాలిక్ కి వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. క్యాబినెట్ మంత్రులతో రాష్ట్ర నాయకులతో మజర్ మాలిక్ వరుస ములఖాత్ లు ఈ ఊహాగానాలకు ఊతం ఇస్తున్నాయి. మొదటి నుండి విద్యార్ధి దశ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యాహరిస్తూ ఉన్నా ఆయన 2021 సంవత్సరంలో సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా ఓట్లు సంపాదించి రెండవ స్థానంలో నిలిచారు. కరోనా కష్ట కాలంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి 70 మందిని ఉద్యోగాలు ఇప్పించారు. బీఅర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 12శాతం మైనారిటీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం పైన తనదైన శైలి లో ధర్నా కార్యక్రమాలు చేసి జైలు పాలయ్యడు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసి చిన్న వయసులో జిల్లా కాంగ్రెస్ లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో విద్యావంతుడిగా ఉన్న మాలిక్ ను మార్కెట్ చైర్మన్ గా ఆవకాశం ఇస్తారా లేదా వేచి చుడాల్సిఉంది..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్