25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణసీఎం రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా బృందం 

సీఎం రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా బృందం 

సీఎం రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా బృందం 

హైదారాబాద్, మార్చ్ 4 యదార్థవాది ప్రతినిధి:

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (డాక్టర్ ఎం.సి. ఆర్ హెచ్. ఆర్.డి) “జర్నిలిజం పబ్లిక్ రిలేషన్స్” అంశంపై అంతర్జాతీయ శిక్షణా పొందుతున్న దక్షిణాఫ్రికాకు చెందిన 29 మంది అధికారులు ప్రాతికేయుల బృందం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కలిశారు. జర్నలిజంలో వస్తున్న నూతన పోకడలు, సోషల్ మీడియా సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధత తదితర అంశాలను తెలుసుకొనేందుకు, అనుభవాలను పంచుకొనేందుకు వీలుగా.. ఈ శిక్షణా జరుగుతోంది. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ వారి ‘ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (ఐటెక్) విభాగం సౌజన్యంతో డాక్టర్ ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. సంస్థలో ఫిబ్రవరి 26 నుండి ఈనెల 9వరకు ఈ అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అధికారులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి అనంతర శిక్షణ నిమిత్తం హైదరాబాద్ కు విచ్చేసిన అధికారులను హార్థకంగా శుభాభినందనలు తెలియజేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి సంస్థ మహానిర్దేశకులు డాక్టర్ శశాంక్ గోయెల్ స్వాగతం పలికారు. శిక్షణలో ఉన్న అధికారులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావుల పాటి మాధవి, సంస్థ ఉన్నతాధికారులు, ఇతర శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్