35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్తెలంగాణ15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.

15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.

15న ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.

-ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

హైదరాబాద్, మార్చ్ 13 యదార్థవాది ప్రతినిధి:

ముస్లీముల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15న తేదీన ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బుధవారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  రంజాన్ తొలి శుక్రవారం నాడైన 15న సీఎం రేవంత్ రెడ్డి ముస్లీమ్ సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా విస్తృత ఏరాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ మొదటి శుక్రవారం సందర్భంగా ఎల్.బి స్టేడియం లో ముస్లీమ్ సోదరులకు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని ఆయన అన్నారు. ఇఫ్తార్ విందులో ముస్లీమ్ సోదరులు నమాజ్ చేయుటకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇఫ్తార్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్రాగు నీరు, మొబైల్ టాయిలెట్స్ తదితర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని  సూచించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా తగు  ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులను కోరారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీఎం కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం, ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, జి.హెచ్.యం.సి కమీషనర్ రోనాల్డ్ రోస్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హనుమంత రావు, నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ , మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్, కాంతి వెస్లీ, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేనీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్, క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపాక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్