18.7 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్ బ్లాగ్

టి హెచ్ ఆర్ అడ్వాన్స్ గిఫ్ట్…!! 

టి హెచ్ ఆర్ అడ్వాన్స్ గిఫ్ట్…!! 

-పది విద్యార్థుల కు కెసిఆర్ డిజిటల్ కేంటెంట్ 

-సాంకేతిక పరిజ్ఞానం తో మేధస్సు కు పదును

-స్కూల్ లో స్పెషల్ స్టడీ, ఇక ఇంట్లో  డిజిటల్ స్టడీ..

-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాగ సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శం గా నిలుస్తుంది.. అదే స్ఫూర్తి తో విద్యారంగం లో అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచింది.. నేటి యువతరం డిజిటల్ , మొబైల్ వైపు విశృంఖలంగ విస్తరిస్తోంది.. ఆదిశగా మాజీ మంత్రి హరీష్ రావు గత సంవత్సరం ఫలితాలను రెట్టింపు  వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత సంవత్సరం నుండి డిజిటల్ కంటెంట్ రూపం లో జిల్లా లోని పదవ తరగతి విద్యార్థుల కు బుక్స్ పంపిణి చేశారు. అదే స్ఫూర్తి తో ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం లోని పదవ తరగతి విద్యార్థుల కు హరీష్ రావు ఇవ్వనున్నారు. ఒక వైపు ఉత్తరం మరో వైపు పాఠశాల లో ప్రత్యేక తరగతులు వీటితో పాటు సరికొత్త కార్యక్రమానికి హరీష్ స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రత్యేక తరగతులతో పాఠశాల లో చదువుతే.. ఇంట్లో ఉండి చదివేల వారి మేధస్సు ఇంక పదును పడేలా ”  డీజిటల్ స్టడీ ” అనే వినూత్న కార్యక్రమానికి గత రెండు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు . త్వరలో నియోజకవర్గం లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో చదివే 2500 మంది విద్యార్థుల కు అందజేయనున్నారు. సిద్దిపేట జిల్లా పదవ తరగతి ఫలితాల్లో గత ఐదు సంవత్సారాలుగా రాష్ట్రంలో నే అగ్రస్థానం లో  నిలిచింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానం లో నిలిచేల గత నెల  నుండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసారు. విద్యార్థుల తల్లీ తండ్రులకు నేరుగా ఉత్తరం వ్రాయడం  తో పాటు వారి ని ఇంటి వద్ద చదివించెల తల్లి తండ్రుల్లో మరియు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేల కాన్ఫరెన్స్  కూడా నిర్వహించారు.

” కెసిఆర్ డిజిటల్ కంటెంట్.. టి హెచ్ ఆర్ గిఫ్ట్ “..

– డిజిటల్ కంటెంట్ గత రెండు సంవత్సరాల మెరుగైన ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా డిజిటల్ కేంటెంట్ ఇచ్చి వారు స్కూల్ నుండి వెళ్ళాక ఇంట్లో కూడా అర్థం కానీ పాఠాలు చదివేల హరీష్ రావు  ఈ కార్యక్రమం చేపట్టారు. గత రెండు సంవత్సరాలనుండి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.. కెసిఆర్ డిజిటల్ కేంటెంట్… టి హెచ్ ఆర్ గిఫ్ట్ తో… పది విద్యార్థుల కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అడ్వాన్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  సాయంత్రం  ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.. కొద్దీ రోజుల్లోనే ఆల్ఫాహారం ప్రారంభం కానుంది. అదే పంథాలో వారిలో మరింత మేధస్సు పదును పెట్టాలి పదవ తరగతి వారి భవితకు ఎంతో పునాది అని ఆ దిశగా పై చదవులకు ఈ పదవ తరగతి స్పూర్తి కావాలని వారు పాఠశాల లోనే కాదు ఇంటి వద్ద కూడా చదువు కొనే ఒక కొత్త కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపారు. 

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు నాలుగు కిలోమీటర్ల మేర మహా కరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షుడు ధ్యాన గద్దర్ భూపతి రాజు తెలిపారు. అనంతరం తాడూరి బాలా గౌడ్  ఫంక్షన్ హాల్ లో  జరిగే ధ్యాన మహాసభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే  తన్నీరు హరీష్ రావు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమాల్లో సుమారు 2000 మంది ధ్యానులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడుఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు వీరేశం, బాలయ్య, సభ్యులు రామచంద్రం రెడ్డి, వెంకటేశo తదితరులు పాల్గొన్నారు.

పట్టణ, గ్రామాల్లో వెల్లడించేది తుది జాబితా కాదు

పట్టణ, గ్రామాల్లో వెల్లడించేది తుది జాబితా కాదు

-అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీదరఖాస్తు చేయండి

-మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 : పట్టణ, గ్రామసభల్లో వెల్లడించేది తుది జాబితా కాదని మాజీ మంత్రి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం అయన మాట్లాడుతు ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ అందోళన చెందాల్సిన పని లేదని జాబితాలో పేరు ఉంటే ఉన్నట్లు. లేకపోతే రానట్లు కాదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా పట్టణం, గ్రామాల్లో జరుగుతున్న సభలను ఉద్దేశించి దామోదర్ రెడ్డి మాట్లాడారు. పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇలా ఏ పధకం అయినా అర్హత ఉన్న వారికే అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జరిగే గ్రామ సభల్లో ప్రకటించే జాబితాలో అర్హత ఉండి పేరు రాకపోతే ఆ గ్రామ సభల్లోనే మళ్ళీ దరఖాస్తు ఫారం పైన దరఖాస్తులు రాసి ఇచ్చినా వాటి ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర అంతా ఇదే పద్ధతి అవలంభించడం జరుగుతుందని తెలిపారు. జాబితాలను ప్రకటించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లిన మాటలు వాస్తవమేనని వాటిని సవరించేందుకే మళ్ళీ పట్టణ, గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఇది నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షం కావాలనే అనవసర రాద్దాంతాలు సృష్టించుతుందని పేర్కొన్నారు. పేదవాడికి మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఒక పేదవాడికి కూడా న్యాయం చేయలేకపోయిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుస్తుందన్నారు. ఈ పథకాలపై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.

కూడవెల్లి ఆలయాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే 

కూడవెల్లి ఆలయాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే 

-జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేసిన చేశారు.

-ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 22 :  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్  భూంపల్లి మండల పరిధిలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర  ఏర్పాట్లను పరిశీలించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  స్వామి వారికీ ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. కూడవల్లి రామలింగేశ్వర స్వామి దయతో దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు కోరారు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఈ జాతర చాలా ప్రసిద్ధి చెందిందని, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అనేక సంఖ్యలో విచ్చేస్తారని ఎమ్మెల్యే  తెలియజేశారు..  ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధికారులకు జాతరకు సంబంధించిన  ఏర్పాట్ల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  ఎమ్మెల్యే వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలోఎస్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు 

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు 

ప్రతి 30 కిలో మీటర్లకు ఓ ట్రామాకేర్ సెంటర్‌

ప్రైవేట్ హస్పత్రులపై నిరంతర నిఘా

మంత్రి దామోదర రాజనర్సింహ

మహబూబ్‌నగర్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 22 :

గ్రామ సభల ద్వారా ప్రజల వద్దకి పాలనను ప్రజా ప్రభుత్వం  తీసుకొచ్చిందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.35 కోట్లతో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకున్నామని, ఒక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, రోడ్డు ప్రమాదాలలో కాని మరే ఇతర కారణం చేత లో గాయపడిన వారిని ప్రాణాలు కాపాడేందుకు ప్రతి 30 కిలో మీటర్లకు ఓ ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు‌ చేయబోతున్నామని, అందులో భాగంగా దేవరకద్రలోనూ ఓ ట్రామా కేర్ సెంటర్ రాబోతున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మంచి విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించే బాధ్యత తీసుకుందని, ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్పిటల్స్‌లో సకల వసతులు కల్పిస్తున్నామని, ఆరోగ్యశాఖలో సంవత్సర కాలంలోనే సుమారు 8 వేల ఉద్యోగాలను నిపుకున్నమని ఈ ఘనత మీరిచ్చిన ప్రొత్బలంతోనేనని సాధ్యమైందని అన్నారు.. మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌లో కార్డియాలజి, నెఫ్రాలజీ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించబోతున్నామని, త్వరలోనే ఎంఆర్‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడొద్దని, వారికి సమీపంలోనే డయాలసిస్ సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది కాలంలోనే కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, దేవరకద్ర, మక్తల్‌‌కు కొత్తగా డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామని, ఒక్కో డయాలసిస్ సెంటర్‌లో 5 చొప్పున, పది డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రయివేట్ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయాలని చూసే ప్రైవేట్ హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గ్రామసభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చాం.. అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా వంటి అన్ని పథకాలు అందజేస్తామని, జాబితాలో మీ పేర్లు లేవని ఆందోళన చెందొద్దని మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని, ప్రతి పేద కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, దశలవారీగా అర్హులైన అందరికీ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

అప్పుడే పుట్టిన పాపకు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

అప్పుడే పుట్టిన పాపకు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

మెదక్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 18 : వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చింది..శనివారం మెదక్ మాత  స్త్రీ శిశు సంక్షేమ హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పాపకు 108 సిబ్బంది సిపిఆర్ చేసి కాపాడున ఘటన మెదక్ జిల్లా పట్టణంలో చోటుచేసుకుంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండగా డాక్టర్ల హైదరాబాద్ కు 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మార్గమధ్యలో గుండె ఆగిపోవడంతో స్పందించిన అంబులెన్స్ టెక్నీషియన్ రాజు పాపకు సిపిఆర్ చేసి కాపాడాడు. అనంతరం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించడంతో పాప ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పైలట్ నవీన్, రాజు లను వైద్య సిబ్బoదిని జిల్లా అధికారులు అభినందించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన బీజేపీ ఎమ్మెల్సీ 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన బీజేపీ ఎమ్మెల్సీ 

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 10 : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు)  బీజేపీ ఎమ్మెల్సీ  ఏ వి ఎన్ రెడ్డి శుక్రవారం  పంపిణీ చేశారు. రామంతపూర్ వెంకట సాయి నగర్( సాయి కృష్ణానగర్), చెందిన మధ్య బోయిన జ్యోతి భర్త శివకు,42,000  బాలకృష్ణ నగర్ కు చెందిన మానస తండ్రి కి 29,000 /- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్సీ ఏ వి ఎన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏ వి ఎన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం లాంటిదని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఏ విజయేందర్ రెడ్డి, మధ్య బోయిన ఐలేష్ యాదవ్, రమేష్, రాజు, మధ్య బోయిన శివ యాదవ్, ఆర్ గోవింద్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, అశోక్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

​తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం

​తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం

తెలుగు మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం

కూటమి ప్రభుత్వానికి తెలుగు భాషపై ఉన్న చిత్తశుద్ధి, పారదర్శక పాలనకు ఇది నిదర్శనం

హర్షం వ్యక్తం చేసిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు

అమరావతి యదార్థవాది ప్రతినిధి, జనవరి 4 : రాష్ట్ర భాష, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు పాలనలో పారదర్శకత ను ప్రోత్సహించడం కోసం టిడిపి కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయం పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయం పై ఆయన స్పందించారు. తెలుగు భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం అని తెలిపారు. తెలుగు భాష పై టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ని, పాలన లో పారదర్శకత కు ఇది నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఇంగ్లీషు జీఓ లు సామాన్య ప్రజలకు అర్థం కాక ఇబ్బందులు ఎదురయ్యేవని ఇకపై ఎటువంటి చీకటి జీవో లు ఉండని.. జవాబుదారీ ప్రభుత్వాన్ని చూడబోతున్నట్లుగా భావిస్తున్నామన్నారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఈ ఉత్తర్వులు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలన్న నిర్ణయం కూడా కూటమి ప్రభుత్వంలో త్వరలోనే అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు భాషపై మమకారం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లకు ఈ సందర్భంగా మేడవరపు రంగనాయకులు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

కోటిమంది కార్యకర్తల ప్రమాద బీమా ఒప్పందం

కోటిమంది కార్యకర్తల ప్రమాద బీమా ఒప్పందం

యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు

జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్

అమరావతి, యదార్థ వాది ప్రతినిధి, జనవరి 2 : మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.  కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చుచేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటుచేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. కుటుంబసభ్యుల మాదిరి పార్టీ కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 2 : సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మీడియా డైరీని గురువారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్ లో సమాచార శాఖ కమిషనర్ ఎస్. హరీష్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఐజేయు జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కార్యదర్శి కె. శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్, గౌస్ మోహియుద్దీన్, అనీల్, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డికి, సమాచార శాఖ కమిషనర్ హరీష్ కు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. విరాహత్ అలీ, కె. రాంనారాయణ లు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...