30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్Videosఅంతర్మథనం లో అభివ్రుద్ది ప్రధాత 

అంతర్మథనం లో అభివ్రుద్ది ప్రధాత 

అంతర్మథనం లో అభివ్రుద్ది ప్రధాత 

• అభివృద్ధి చేశాక ప్రజా వ్యతిరేకత ఎందుకూ..?

• నాయకులపై అతి నమ్మకం కొంప ముంచిందా..?

• మెజారిటీ తక్కువ రావడానికి రెండవ శ్రేణి నాయకుల అసలు కారణమా..?

• వాళ్ళ తల బిరుసుతనమే కొంప ముంచిదా..?

• సిద్దిపేట నియోజకవర్గం పై 

యదార్థవాది ప్రత్యేక కథనం..

యదార్థవాది తెలంగాణ బ్యూరో

పదెళ్ళ క్రితం సిద్దిపేటకు ప్రస్తుతం సిద్దిపేట ను చూస్తే నోరెళ్ళబెట్టక మానరు ప్రజలూ నీటి ఎద్దడి దగ్గరనుండి ప్రతీ రోజూ తాగు నీరు సాగు నీరు అందేవరకు అభివృద్ధి జరిగింది. అలాగె సామాజిక అభవృద్ది కూడా ఒక స్థాయిలో జరిగిందంటే అతియోషక్తి కాదు  అటు విద్య వైద్యము ఉపాధి లాంటి అనేక విషయాల్లో సిద్దిపేట పట్టణం రాష్ట్రంలో అన్ని నియోజవర్గాల్లో కంటె పది సంవత్సరాల ముందున్నది అన్నది ప్రజలనోటి మాట అలాంటప్పుడు 2023 లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడక కావాలి కాని ఈ ఎన్నికలో అలా జరగలేదు 2004 నుండీ సిద్దిపేట ఏమ్మెళ్యే గా ప్రతీ ఎన్నికల్లో మెజారిటీ పెంచుకుంటూ రికార్డు స్థాయిలో విజయ దుందుభి మోగిస్తున్న హరిష్ రావు ఈ ఎన్నికల్లో ఎందుకు ఢీలా పడ్డారు..? ఎందుకు అంతర్మథనం చెందుతున్నారు..? మెజారిటీ  అంటూ ఊపు దుంకుడు మాటలు ఎందుకూ మాట్లాడారు..? ఒక్కసారిగా అయాన పై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు పెరిగింది…? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దాదాపు  పథకాలు ప్రతీ కుటుంబానికి చేరాయి

మరెందుకు వ్యతిరేకత పెరిగింది….? ఈ ఎన్నికల్లో ఔర్ ఎక్ దక్క దెడ్ లాక్ పక్క అంటూ స్లోగన్ ఇచ్చినా బ్యానర్లు ఇప్పుడు 

రెండవ శ్రేణి నాయకుల మొహాలు ఎందుకు వాడిపోయాయి.? తెలుసుకోవాల్సిన అవసరము ఉంది.  అందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం సిద్దిపేట నియోజక వర్గాన్ని  రెండవ క్యాడర్ కు వదిలి మిగతా నియోజకవర్గాల్లో  హరిష్ రావు పర్యటన చెయడం అయాన చేసిన మొదటి తప్పని ప్రజలూ అనుకుంటున్నారు. వంద  ఓట్లకు ఒక ఏజెంట్ లను పేట్టి ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లాల్సిందిగా చెప్పి వెళ్లిన హరిష్ స్త్రాటర్గి ఫెయిల్ అయ్యిందనే చెప్పవచ్చు  కనీసం పొలింగ్ చిట్టిలు కూడా కొంత మంది దగ్గరకు అండలేదంటే నాయకులూ ఎంత ఆత్మ విశ్వాసం గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని ప్రజలూ అనుకోవడం కనిపిస్తుంది.

దెబ్బతీసిన రెండవ శ్రేణి నాయకుల తల బిరుసుతనం కూడా.. 

ఇక రెండవ శ్రేణి నాయకుల విషయానికీ వస్తె వారికి కళ్ళు నెత్తికి ఎక్కాయి అని ప్రజలూ అంటున్నరంటే ఎంతటి అరాచకం ఇక్కడ రాజ్యమేలుతుంది అన్న విషయం గ్రహించాలి అంటున్నా జనం. మాకు ఎదురే లేదూ అనుకుంటూ ప్రతీ విషయంలో వేలు పెట్టీ కాలుపెట్టి మధ్యవర్తిత్వం, దందాలు కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి. సైకిల్ పై తిరిగినొల్లు నేడు కార్లు ఎకరాల భూముల ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కనీసం హరీష్ రావు ను కలసి తమా గోడు వెళ్లబోసుకుందామని అనుకుంటున్నా సామాన్యుడికి శిఖండి లాగా ఈ రెండవ స్థాయి నాయకులు  అడ్డుకుంటున్నారని ప్రధాన ఆరోపణ. హరీష్ రావు చుట్టూ ఒక 10 మంది రాజ్యం ఏలుతున్నరని వారినీ నియంత్రింపోవడం హరిష్ తప్పిడమని రాజకీయా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైనా సరే సారు ఉన్నాడు మమల్ని కాపాడటానికి అన్న ధైర్యం వారిలో పెనవేసుకుందని,ఇక ఆ పది మంది అనుచరల ఆగడాలకు అడ్డుకట్ట లేదన్నది కూడా ప్రధాన ఆరోపణ. జిల్లాకు చెందిన ప్రతీ శాఖల్లో నే కాకుండా ప్రధానంగా పోలిస్ శాఖలో వారి హవా చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు అంటున్నారు బాధితులు.. ఇక సామాన్యుడు ఎలా ఓటేస్తాడు. విసిగిపోయిన సామాన్యుడు ఈ సారీ తన ఓటుతో సమాధానం చెప్పాడని రాజకీయా విశ్లేషకుల అంచనా..ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్