34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅక్రమంగా సంపాదించినదంతా .. హుజురాబాదు లో ఖర్చు చేస్తున్నారు.. - టిఆర్ఎస్ పై ఈటెల...

అక్రమంగా సంపాదించినదంతా .. హుజురాబాదు లో ఖర్చు చేస్తున్నారు.. – టిఆర్ఎస్ పై ఈటెల బాకులు..

కెసిఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించిన మచ్చ లేకుండా చేశానని అటువంటి తనపై అక్రమ ఆరోపణలు చేసి బయటకు పంపించడని హుజురాబాద్ బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. 18 ఏండ్లు టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించానని గుర్తు చేసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పద్మశాలి కులస్తులతో సమావేశం అయ్యారు. ఈ ఈటెల ఒక్కడిపై పోరాడి గెలవలేక ఈ.. వందల కోట్లు ఖర్చు చేసి ఇన్ని వేల కోట్ల హామీలు ఇచ్చరని మండిపడ్డారు. ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు హుజరాబాద్ నియోజకవర్గలో ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ అహకారాన్ని బొంద పెట్టకపోతే రేపు రాష్ట్రానికి పరిచయం రాబోతుందని ఆయన అన్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆస్తులు అమ్ముకుని అయినా కెసిఆర్ దుర్మార్గాల పై పోరాడుతానని అన్నారు. టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే తే పెన్షన్లు దళిత బందు రానివ్వకుండా చేస్తామని అని దుయ్యబట్టారు.
తమకు ఓట్లు లేకుంటే సొసైటీ పాలకవర్గాలను కథం చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేలు బెదిరిస్తునరని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్