అప్పటి ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి
కార్యకర్తలే బలం: బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితల
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం కోహెడ మండల కేంద్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజల బేరీజు వేసుకోవాలని అన్కునారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రధంగా నిలిపామని రైతులు వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులు నిరుద్యోగులు ఇలా అందరి బ్రతుకులు బాగుపడ్డాయని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రంలో పోటీ చేస్తే బాగుండేది అని ఆయా రాష్ట్రాలు ప్రజలు కోరుతున్నారని ఇలాంటి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రతి గడప గడపకు వెళ్లి వివరించాలని శరవేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు పరుగులు పెడుతుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్ర భాగానే ఉంటుందని ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడంతో పాటు ఆపదలో అండగా ఉంటున్నామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన బస్సాపూర్ గ్రామానికి చెందిన బిజగా సింగరయ్య కోహడకు చెందిన పొన్నాల సాయిచరణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా రెండు లక్షల రూపాయల విలువగల పార్టీ ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో కోహెడ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు 63 లక్షల 7 వేల 380 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి జడ్పిటిసి శ్యామల కర్ర శ్రీహరి ఆవుల మహేందర్ స్వామి కృష్ణమూర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.