అప్పు తీర్చలేక ప్రాణ స్నేహితుడిని హతమార్చాడు
యదార్థవాది బ్యూరో నందిపేట్
తీసుకున్న అప్పు తీర్చలేక తనతోపాటు చదువుకున్న ప్రాణ స్నేహితుని హత్య చేసిన సంఘటన నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో జరిగింది. ఏసీపి.ప్రభాకర్ రావు పత్రికా విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి గ్రామానికి చెందిన ఎర్రగట్ల.శ్రీకాంత్s/o బాలన్న(25) కనబడుటలేదని అతని అన్న ఎర్రగట్ల బాలరాజు 30/11 రోజున ఫిర్యాదు చేయడంతో ఎస్సై శ్రీకాంత్ మిస్సింగ్ కేసు 172 సెక్షన్ కిందనమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు తేదీ 3/12 రోజున అనుమానంతో గోదారి పరిసర ప్రాంతాల్లో వెతకగా మృతుడి బైక్ బ్రిడ్జి దగ్గర ఉండడంతో దీంతో గోదావరి తీరంలో వెతకడంతో సమీపంలో మృతదేహం లభించింది.దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు దర్పంగా 8/2/2023 రోజు ఉదయం మృతుడి స్నేహితుడైన నాగం భోజేందర్ ను నందిపేట బస్టాండ్ లో పట్టుకొని విచారించరగా ఎరుగట్ల శ్రీకాంత్ దగ్గర ఎవరికి తెలియ కుండా 2 లక్షలు రూపాయలు అప్పుగా తీసుకున్నానని అతను దుబాయ్ నుండి తిరిగి రాగానే తన డబ్బులు తనకు ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అతనిని హత్య చేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పని ఉండదని పథకం ప్రకారం 3/2/2023 రోజున సాయంత్రం 6:30 గంటల సమయంలో ఫోన్ చేసి గోదావరి నది బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పడం జరిగిందని అతను వచ్చిన తర్వాత బ్రిడ్జి గోడపై కూర్చోండి మాట్లాడుతున్న సమయంలో అనుకున్న ప్రకారం నదిలోకి నెట్టివేసి చంపివేశానని. మృతుడి బైక్ అక్కడే వదిలేసి అందరూ ఆత్మహత్య అనుకోవాలని అక్కడి నుండి పారిపోయినట్లు నేరస్థుడు నాగంబోజేందర్ తెలిపినట్లు నేరస్తున్ని కోర్టుకు హాజరు పరుచుతున్నట్లు ఏసీపి.ప్రభాకర్ రావు తెలిపారు.హత్య కేసును చేదించిన సీఐ గోవర్ధన్ రెడ్డి,ఎస్సై శ్రీకాంత్,ఎస్ ఐ 2,అరిపోద్దిన్,ఏఎస్ఐ రాజేందర్,పిసి.ముత్యం,విట్టల్,గంగ నరసయ్యలను అభినందించారు..