21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణఅభివృద్దా…పార్టీయా…

అభివృద్దా…పార్టీయా…

అభివృద్దా…పార్టీయా…

మాజీ మంత్రి హరీష్ రావు మదిలో ఏముందో.?

రాష్ట్రంలో అనూహ్య  ఫలితాల నేపథ్యంలో సిద్దిపేట ప్రజల సమాలోచనలు

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది 

అధికారంలో ఉన్నందున ఇంతకుముందు ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేట శరవేగంగా  అభివృద్ధి చెందింది. ఈ విషయాన్ని ఏ చిన్న బాలుడిని అడిగిన ఇదే విషయం చెబుతారు. రాష్ట్రంలోనే ఏ ఏ నియోజకవర్గము కూడా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇది ఒకరకంగా రికార్డు స్థాయిలోనేనని భావించవచ్చు. అంతటి స్థాయిలో సిద్దిపేట అభివృద్ధి చెందడాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఇప్పుడు కూడా ఆ స్థాయిలో అభివృద్ధి నీ  సహజంగా కోరుకుంటారు.  అయితే ఆ స్థాయిలో అభివృద్ధి  చెందుతుందా అనే విషయంలో మీమాంసలో పడ్డారు. రాష్ట్రంలో రాజకీయాలు అనున్యయంగా మారిపోయాయి.. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హవా కొనసాగుతుండగా జరిగిన ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఊహించని చుక్క ఎదురైంది టిఆర్ఎస్ పార్టీ కాస్త కుప్పకూలి కాంగ్రెస్ చేతికి అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ ఫలితాలు నేపథ్యంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం మారడం అలాగే హరీష్ రావు ఎమ్మెల్యే గానే ఉండాల్సి వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి ఏ మేరకు ఉంటుందోనని ప్రజలు సంక్షేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట అభివృద్ధిని కాంక్షించి హరీష్ రావు ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారుతి బాగుండని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కానీ మొదటి నుండి తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హరీష్ రావు పార్టీ మారుతారా లేదా అన్న విషయం పక్కన పెడితే సిద్దిపేట అభివృద్ధి మాత్రం ఇంతకుముందు జరిగినట్లుగా జరిగే అవకాశాలు తక్కువనే ఉండొచ్చు ఒకవేళ హరీష్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలోకి దూకితే మాత్రం సిద్దిపేట అభివృద్ధికి ఎలాంటి డొక్కా ఉండదు అని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా హైదరాబాదు టిఆర్ఎస్ భవన్ లో సోమవారం టిఆర్ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు కనిపించకపోవడంతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు పలు రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. హరీష్ రావు సిద్దిపేట అభివృద్ధి కోసం పాటుపడతారా అని కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా హరీష్ రావు మునుపటిలా సిద్దిపేట అభివృద్ధి జరిగేలా సరేన నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్