అర్జీదరులకు న్యాయం చేయడం మన కర్తవ్యం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ప్రజావాణి అని జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మీల్ ఖాన్ అన్నారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు నేరుగా విన్నవించి పరిష్కరించుకోవడానికి అర్జిదారులు ఎంతో ఆశతో కార్యలయంకి వస్తారని వారందరికీ న్యాయం చేయడం అధికారులుగా మన కర్తవ్యం అని జిల్లా అధికారులకు తెలిపారు. అర్జిదారుల నుండి తీసుకున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించి నివేదిక అందించాలి. అర్జిదారులకు ప్రజావాణి కార్యక్రమం పైన నమ్మకం పెరిగిందని క్రమక్రమంగా అర్జిదారుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఎంతో ఉత్సాహంతో పనిచేయ్యాలన్నారు. భూ సంబంధిత రెండు పడక గదుల ఇండ్లు ఆసరా పింఛన్లు మరియు ఇతరత్రా మొత్తం కలపి 81 దరఖాస్తులు అందాయని అన్నారు అనంతరం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జారీచేసిన ఫైనాన్సియల్ లిటరసీ వీక్-2023 ప్లేక్సి పోస్టర్ లను ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.