ఆదర్శవంతంగా కీర్తించబడే మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళ సిబ్బందిని పోలీస్ హెడ్ క్వార్టర్ లో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య బుధవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉంది వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని అన్నారు. శక్తిసామర్ధ్యాలలో అభివృద్ధిలో నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి వంటింటికే పరిమితం కాకుండా అంతరిక్ష పరిశోధన నుంచి భూగర్భల వరకు మేటి విలువలతో విభిన్న రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూనే మేలైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఆర్.ఐ లు కుమారస్వామి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు మహిళ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.