ఆర్థికంగా ఎదగడానికి..దళిత బంధు..
సిద్దిపేట 21 బుధవారం 2022.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు రాష్ట్ర అడ్వైజర్ వి.లక్ష్మారెడ్డి పథకాన్ని బుధవారం చిన్నకోడూరు మండలం చెల్కకలపల్లి, నారాయణరావుపేట మండలం బంజేరుపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దళిత బంధు ద్వారా వచ్చిన పౌల్టిఫామ్స్, డైరీ ఫార్మ్స్,ఇతర పథకాలను సందర్శించి,లబ్ధిదారులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకమును లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు అందుకున్న దళిత బంధు లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామాచారి, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు