ఇంటర్ పరీక్షలు ప్రశాంతం వాతావరణంలో ప్రారంభం..
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం లోని సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీ ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును నిఘా నేత్రాల ఏర్పాటును పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్, కళాశాల ప్రిన్సిపాల్ జి వనజ కుమారి జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ పరీక్షా కేంద్రంలో 198 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 183 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరు అయ్యారని అధికారులు కలెక్టర్ వివరించారు. అనంతరం పరీక్షా కేంద్రంలోని రూములు పరిశీలించి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రంలో కల్పించిన ఫర్నిచర్, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు..