ఉచిత అంబులెన్స్ ప్రారంభం..
జిల్లాపరిషత్ నిధుల నుండి మంజురైన ఉచిత అంబులెన్స్ బొమ్మల రామారం మండల కేంద్రంలో మంగళవారం ప్రారంభించిన ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్ నిర్వహణ కోసం ఎంపీటీసీలు, సర్పంచులు వారి 2 నెలల, ప్యాక్స్ ఛైర్మెన్ బాలనర్సయ్య వారి 6 నెలల, ప్యాక్స్ డైరెక్టర్ కొండూజు ఆంజనేయులు రూ.10000లుఇవ్వడం అభినందనీయమని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకువచ్చి ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్,మండలంలో ఎంపీటీసీ లు, సర్పంచులు, ప్యాక్స్ ఛైర్మెన్, డైరెక్టర్,ఇంచార్జి ఎంపీడీఓ ,వైద్య, పోలీలు తదితరులు పాల్గొన్నారు.