రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను గురువారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ మాతృ వియోగం జరిగిన నేపథ్యంలో హోం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వచ్చారు. మంత్రి మాతృమూర్తి శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ వద్ద శాంతమ్మ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి, జడ్చర్ల మూవీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రవీందర్ ముదిరాజ్, జిల్లా నేతలు గోపాల్,కురూముర్తి, గోపాల్ యాదవ్, శాంతం అని యాదవ్, శైలు యాదవ్,
విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు శాంతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.