క్యూ న్యూస్ అధినేతకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. తీన్మార్ మల్లన్న హైదరాబాదులోని ఒక జ్యోతిష్యుడి ని బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆయనను ఆగస్టులో అరెస్టు చేశారు. అప్పుడు క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి. కొన్ని ఆర్డిస్కలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మల్లన్న పై ఇప్పటి వరకు 38 కేసులు నమోదు కాగా అందులో హైకోర్టు ఆరు కేసులను కొట్టి వేసింది. మిగితా 32 కేసుల్లో 31 కేసుల్లో ఇదివరకే బేలు మంజూరు అయింది. పెండింగ్లో ఉన్న 1 కేసులో సోమవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్న ఇప్పటివరకు డెబ్భై నాలుగు రోజులుగా జైల్లోనే ఉన్నారు. బేలు మంజూరు కోసం మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది. ఈమేరకు న్యాయస్థానం అం బెయిలు మంజూరు చేసింది. సోమవారం మల్లన్న జైలు నుండి విడుదల అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను తీన్మార్ మల్లన్న భార్య, సోదరుడితో కలిసి తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసినారు. అక్రమ కేసులు పెట్టి ఇ నా భర్తను వేధిస్తున్నారని అని ఆరోపించారు కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని చెప్పారు. కేసు మీద కేసు ఒక కేసుకు బేలు తీసుకుంటే మరొక కేసు పెడుతున్నారని చెప్పారు. ఇటీవలే మల్లన్న బిజెపిలో చేరుతున్నట్లు క్యూ న్యూస్ ఛానల్ ప్రకటించిన విషయం తెలిసిందే.