యదార్థవాది సిద్దిపేట 18 డిసెంబర్ 2022.
రాష్టంలో అత్యధికం శాతంలో ఉన్న మున్నూరు కాపుల్లో ఐక్యత రావాలి.. హక్కుల సాధన కోసమే చైతన్య యాత్ర చేపడుతున్నమని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్నమని, రాష్ట్ర జనాభాలో 24 శాతం ఉన్నా ఆశించిన ప్రయోజనాలు లేవన్నారు. వాస్తవానికి మున్నూరుకాపుల్లో ఐక్యతలేకనే నష్టపోతున్నామన్నారు. తెలంగాణలోని అన్ని కులాలకు ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకం అమలుచేస్తూ లబ్ది చేకూరుస్తోందన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని దేవయ్య ప్రభుత్వాన్ని కోరారు. మున్నూరుకాపులు ఆర్థికంగా ఎదగాలంటే రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, పేదలకు ఆర్థికాభవృద్ధికి చేయూత నివ్వాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యే స్థానాలలో పోటీకి మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. మున్నూరుకాపుల్లో ఐక్యత.. హక్కుల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఈనెల 19 సోమవారం నుండి వేములవాడలో చైతన్య యాత్ర ప్రారంభమై.. భద్రాచలం వరకూ కొనసాగుతోందనిన్నారు. వచ్చే మార్చిలో హైదరాబాద్ లో మున్నూరు కాపు గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. చైతన్య యాత్రను విజయవంతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా మున్నూరుకాపులు కదిలి రావాలన్నారు.జిల్లా అధ్యక్షులు నాయకం మల్లయ్య, రాష్ట్ర జర్నలిస్ట్ ఫోరం కొత్త లక్ష్మణ్, రాష్ట్ర ఉద్యోగ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సొప్ప పూర్ణ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.