26.9 C
Hyderabad
Tuesday, September 16, 2025
హోమ్తెలంగాణకార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: ఎమ్మెల్యే

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: ఎమ్మెల్యే

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: ఎమ్మెల్యే

కరీంనగర్ యదార్థవాది

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ తెలిపారు.. శనివారం మానకొండూర్ మండలంలోని గ్రామాలలో పర్యటించి కళ్యాణలక్ష్మి, సీఎమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. అన్నారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించి, తమ సానుభూతి తెలిపారు.. ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన దాంసాని అశోక్ రెడ్డి, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రాపాక శ్రవణ్ అనే ఇద్దరు బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల వేరు వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ కింద మంజూరైనా రూ.4 లక్షల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అయన అందజేశారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్