కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్.. తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు..
యదార్థవాది ప్రతినిధి కుప్పం
నటుడు నందమూరి తారకరత్నకు మెరుగైన వైద్యంఅందించేందుకుబెంగుళూరుకుతరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం నుంచి బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్‌కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ తరహాలో.. తారకరత్నను తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరిస్తోందని చెప్పారు.