ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ వార్తల్లో ఉండే సోనుసూద్ తాజాగా కూరగాయలు అమ్మి సహాయం చేశాడు. యూపీలోని లక్నోలో తోపుడు బండి పై కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకులతో కలిసి కూరగాయలు విక్రయించాడు. కాగా తాజా కూరగాయల కోసం నాకు ఆర్డర్ వేయండి వాటిని తిని ఆరోగ్యంగా ఉండండి అంటూ కూరగాయలు అమ్ముతున్న వీడియోను సోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అలాగే చిరు వ్యాపారులు వద్ద కూరగాయలు కొనాలని అభ్యర్థించాడు.