కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
వికసిత్ భారత్ సంకల్పయాత్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టినకేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకై వికసిద్భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని స్థానిక గ్రామపంచాయతీ ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికసిత భారత్ ప్రోగ్రాం నోడల్ అధికారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వెంకట్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన లో ప్రతి వ్యక్తి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వయసు రిత్యా ప్రీమియం చెల్లించినట్లయితే 60 వ సంవత్సరం నుండి పెన్షన్ లభిస్తుందని ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన పథకంలో సంవత్సరానికి 436 చెల్లించినట్లయితే ఏ కారణం చేతనైనా వ్యక్తి మరణించిన వారి యొక్క నామినీకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది అలాగే ప్రధానమంత్రి సురక్ష పథకంలో సంవత్సరానికి రూ. 20 చెల్లించినట్లయితే ఎలాంటి ఆక్సిడెంట్ రూపంలో అయినా మరణించినట్లయితే వారి నామినేకి రెండు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది అని ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తీసుకొని ఇన్సూరెన్స్ పొందాలని సూచించారు అలాగే ఆరోగ్య శాఖ నుండి ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహణ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ ఐకెపి ఆరోగ్యశ్రీ టీబీ అగ్రికల్చర్ అధికారులు సిబ్బంది పంచాయతీ కార్యదర్శి దేవేందర్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళ శ్రీనివాస్ రాంచరణ్ రెడ్డి సాగర్ రావు తిరుపతి సాగర్ హరి కిషన్ గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.