క్రీడలతో మానసిక వికాసం శారీరక దారుడ్యం
సిద్దిపేట 19 డిసెంబర్ 2022
ఒక క్రీడల్లో మాత్రమే కులం, మతం, జాతి, అనుభేదం లేదు..
గెలుపుతో పొంగిపోకుండా, ఓడినప్పుడుబాధపడకుండదు..
క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుడ్యం లభిస్తుందని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో ముందుండాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయ సెకండ్ ఆన్యూవల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సోమవారం జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట పట్టణంలో మరియు తదితల పట్టణాలలో స్పోర్ట్స్ గురించి స్థలాలను కేటాయించి యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు కృషితో క్రీడలకు స్పోర్ట్స్ కు పెద్దపీట వేయడం జరుగుతుందని, వారిని ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు కోసం రోజుకు ఒక గంట వాకింగ్ యోగ మెడిటేషన్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. రాష్ట్రస్థాయిలో దేశస్థాయిలో ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించిన వారి జీవిత చరిత్రలు చదివి వారిని అనుసరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాలయ ప్రిన్సిపల్ మార్కండేయులు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.