గురుకులాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్..
సిద్ధిపేట యదార్థవాది
గురుకుల విద్యాలయాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్ కార్యక్రమం వాల్పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గురుకుల ప్రిన్సిపాల్ లతో కలిసి ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్…
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి మే 6 వ తేదీ వరకు స్పార్క్ లెస్ పేరుతో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించి విద్యార్థులకు ఎంపిక చేసిన రంగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ క్యాంపులో పాల్గొనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయా రంగాల్లో తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని, ఈ ప్రతిభ భవిష్యత్తులో ఎంచుకున్న రంగాల్లో విజయవంతంగా రానించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
హుస్నాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (బాయ్స్) కాలేజీలో బాలురకు చిత్రలేఖనం, యాంకరింగ్, ఉపన్యాసం, యువ జర్నలిస్ట్, వెస్టర్న్ డాన్స్ రంగాలలో…
తొగుట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీలో బాలికలకు లైఫ్ స్కిల్స్, వెస్టర్న్ డాన్స్, బ్యూటీ కేర్, బేసిక్ అబాకస్ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు..
కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆర్సిఓ కె.నిర్మల, హుస్నాబాద్ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తోట గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ మెర్సీ వరూధిని, ఇతర గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.