గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
• సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ డిమాండ్.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ అన్నారు. గురువారం రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం లోని తపాలా కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన చొప్పరి రవి కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో 7వ పే కమిషన్ న్ను అమలు చేయకుండా మరలా కమల చంద్ర కమిషన్ను వేశారని ఆ కమిషన్ చేసిన అధ్యయనంలో కార్మికుల సేవలను గుర్తించిందని కానీ ఆ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం దాచి చోద్యం చూస్తుందన్నారు. తక్షణమే ఆ రిపోర్ట్ను బహిర్గతం చేసి అమలు చేయాలని అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత 8 గంటల పనితో పాటు అన్నీ ప్రయోజనాలు కల్పించాలని అన్నారు. కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించాలని 65 సంవత్సరాల ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగ విరమణ ప్యాకేజీ 5 లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం ఐదు లక్షలు చెల్లించాలని తదితర డిమాండ్లను సత్వర పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం జిల్లా కార్యదర్శి శంకర్, జనార్ధన్ ఆంజనేయులు తిరుపతి రెడ్డి నాంపల్లి రంగాచారి ఎల్లయ్య మీన శ్రీలత భార్గవి తదితరులు పాల్గొన్నారు.