34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర

ఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర

ఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్
శ్రీరామనవమి సందర్భంగా పలుచోట్ల భక్తులు శ్రీ సీతారాముల శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్రను భక్తులు వైభవంగా నిర్వహించారు. కోలాటాలతో, డప్పు చప్పుల్లతో నిర్వహించిన ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు. గ్రామమంతా సీతారాముల నామస్మరనతో మారు మ్రోగింది. పందిల్ల స్టేజి వద్ద ఉన్న దేవాలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామి వారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా పాడిపంటలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ శోభయాత్రలో కౌన్సిలర్ బొమ్మగాని అంజయ్య, గౌరవ అధ్యక్షులు మాదాటి వెంకట్రెడ్డి, తాటికొండ జైపాల్ రెడ్డి ,ఎల్లా గౌడ్ కిష్టయ్య, లక్ష్మణ్, కృష్ణ, తిరుపతి ఐలయ్య గౌడ్, అలుమల్ల బూట్ల రెడ్డి, తాడూరి బాబు బొమ్మగాని రవీందర్ గౌడ్ మహిళలు పాల్గొన్నారు,

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్