ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి..
నిజామాబాద్: యదార్థవాది ప్రతినిది
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ మామిడిపల్లిలోని సుభాష్ చంద్రబోస్ ఘనంగా నివాళు అర్పించిన బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్.. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ “జయంతి తప్ప వర్ధంతి ఎరుగునటువంటి” ఓ మహా నేత అని. శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్య్రం రాదని మహాత్మా గాంధీతో విభేదించి “ఆజాద్ హింద్ ఫౌజ్” సైన్యాన్ని నిర్మాణం చేసి మహిళలను సైతం ఈ సైన్యంలో భాగస్వామ్యం చేయడమైనదని. “జైహింద్” అనే నినాదాన్ని ఇచ్చి “యువకులారా మీరు రక్తాన్ని ఇవ్వండి నేను ఈ దేశానికి స్వాతంత్ర్యం ను ఇస్తానని” చెప్పి నినదించినటువంటి గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని. సుభాష్ చంద్రబోస్ అఖండ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రమాణ స్వీకారం చేయడమైందని. అందుకే భారతీయులందరూ సుభాష్ చంద్రబోస్ ను నేతాజీగా పిలుచుకుంటారని. ఇలాంటి నేతాజీని ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో “ఈ దేశం కోసం–ధర్మం కోసం” పనిచేస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అన్ని విధాల మద్దతుగా నిలిచి మరోసారి మోడీని ఈ దేశానికి నేతగా, ప్రధానమంత్రిగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, కర్తన్ మధు, దళిత మోర్చ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శ్యామ్ గౌడ్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి చిక్కు గంగాధర్, దళిత మోర్ఛ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ మరియు అల్జాపూర్ రాజేష్,బారడ్ వినోద్, బొంత శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.