25.5 C
Hyderabad
Tuesday, July 1, 2025
హోమ్తెలంగాణఘనంగా స్వామి వివేకానంద జయంతి..

ఘనంగా స్వామి వివేకానంద జయంతి..

ఘనంగా స్వామి వివేకానంద జయంతి..

వనపర్తి: 12 యదార్థవాది ప్రతినిది

స్వామి వివేకానంద ఆశయాలను నేటి ప్రతి యువత మార్గదర్శకంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు గుర్తు చేశారు.. జిల్లా పోలీసు కార్యాలయములో గురువారం అపూర్వరావు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత భవిష్యత్తులో రాణించేందుకు, స్వామి వివేకనంద సూక్తులు స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం వుందని తెలిపారు. వివేకానంద ఆశయాలకు తగ్గట్లుగానే యువత దేశాభివృద్ధిలో కీలకంకావాలని, వివేకానంద ఆలోచనలను పాటించడం ద్వారా ప్రతి పోలీసు అధికారి తాను నిర్వహించే విధుల్లో రాణించడంతో పాటు, ప్రజల్లో పోలీసుల గౌరవం పెరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్, వెంకట్, సిసిఎస్ ఎస్సై, హృషికేశ్, ఐటి కోర్ ఎస్సై, వేణు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్