జీవో నంబర్.1 రద్దు చేయాలి.
అఖిలపక్షం డిమాండ్
యదార్థవాది ప్రతినిధి ఏలూరు
ప్రజాస్వామిక హక్కులను కాలరాసేలా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం.1 తక్షణమే రద్దు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏలూరు స్థానిక గాంధీ మైదానంలో అఖిలపక్ష నాయకులు జీవో నం.1పై నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్,సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి జగన్ నియంత మాదిరిగా జీవో నం.1ని తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజల గొంతుకను అణిచివేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరునికి కల్పిస్తే వైసిపి ప్రభుత్వం వాటిని హరిస్తూ పౌర హక్కులను కాలరాస్తుందన్నారు. జగన్ నియంతృత్వ పాలనకు జీవో నం.1 నిదర్శనం అన్నారు. ప్రజా ఉద్యమాలు అణచివేసేందుకు వైసిపి ప్రభుత్వం అక్రమంగా జీవోలను విడుదల చేసిందన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసుకువచ్చి ప్రతిపక్షాల ఉద్యమాలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో నం.1ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జీవో నం.1 రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. గాంధీజీ విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండివెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, సిపిఎం నాయకులు డిఎన్ విడి ప్రసాద్, బి సోమయ్య, కే శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బద్దావెంకట్రావు, కాకర్ల అప్పారావు, ఎర్ర శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు ఇళ్ళ శ్రీనివాస్, కస్తూరి తేజస్విని, నగిరెడ్డి కాశీ నరేష్, గుబ్బల నాగేశ్వరరావు, అఖిలపక్ష నాయకులు ఎస్. సాయిబాబా, కే వరప్రసాద్, గేదెల నాగేశ్వరరావు, ఎం విజయ, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, పోలా భాస్కర్, టి శ్రీను, అల్లు సాయి చరణ్, పైడి లక్ష్మణరావు, బొండా రాము, డి వీరి నాయుడు, ఎం రాము, జి రమణ, భూపతి రాఘవ, కొండ శివ, బి జగన్నాథం, వైయస్ కనకారావు, ఏసుబాబు, బ్రహ్మం, నరసింహమూర్తి, కోటేశ్వరరావు, నూకరాజు, కోరాడ అప్పారావు, క్రాంతి, కే సుజాత, ప్రమీల, సరళ, జె .సుజాత, బి ఉమా దుర్గ, తదితరులు పాల్గొన్నారు.