డీజిల్ను దొంగల్ని పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ధపల్లి గ్రామం మరియు డిచ్పల్లి ఖిల్లా వద్దగల సెల్ టవర్ల యొక్క జనరేటర్ ల నుండి డీజిల్ ని దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డిచ్ పల్లి పోలీసులు తెలిపారు. ఇందల్వాయి మండలానికి చెందిన తిరుమన్పల్లి గ్రామస్థులు మహమ్మద్ సమీర్, కలిగొట్ సాకలి కార్తీక్, వీరిద్దరూ మరొక మైనర్ తో కలిసి డిచ్ పల్లి మండలం, ఇందల్వాయి మండలం, జక్రాన్పల్లి మండలం, సదాశివ నగర్ మండలం ఇతర చుట్టు పక్కల మండలాలలో గల సెల్ టవర్ల యొక్క జనరేటర్ల నుండి డీజిల్ ను దొంగతనం చేసి బయట వేరే వ్యక్తులకు అమ్ముకునేవారని నిర్దారించారు. వీరు ఇప్పటి వరకు నాలుగు మండలాలలో కలిపి అందాజ 900 లీటర్ల వరకు డీజిల్ ను దొంగిలించినారు. ఇట్టి నేరస్తులను కోర్టు యందు హాజరు పరచగా, గౌరవ కోర్టు నేరస్తులను రిమాండ్ కు తరలించనైనదని డిచ్ పల్లి ఎస్సై తెలిపారు.