తెలంగాణలో మద్యం జోరు
హైదరాబాద్: 1 జనవరి
రాష్ట్రంలో మద్యం ద్వారా 6 రోజులలో రికార్డ్ స్థాయిలో రూ.1,111.29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆప్కారి శాఖ లెక్కలు వెల్లడించాయి. డిసెంబర్ 30న అత్యధికంగా 254 కోట్లు, డిసెంబర్ 31న రూ.216 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఆప్కారి శాఖ గుణంకాలు తెలుస్తున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ 31న రూ. 171.93 మద్యం విక్రయాలు జరిగినట్లు ఆప్కారి శాఖ తెలిపింది.కొత్త ఏడాది సందర్భంగా ప్రభుత్వం మధ్య విక్రయాల వేళలు పొడిగించడంతో మందుబాబులకు కలిసొచ్చి డిసెంబర్ 31 అర్ధవా రాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించి దీంతో మద్యం అమ్మకాలు బాగా జరిగాయి అప్కారి శాఖ తెలిపింది.