త్వరలో దేవ దేవుని ఆలయ నిర్మాణం: మంత్రి పొన్నం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి:
తిరుమలలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నీ కలిసి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవంగా భావించే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్మించాలని చైర్మన్ భూమన కరుణాకర్ కు మంత్రి వినతి పత్రం అందజేశారు. ఆలయ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తామని స్వామివారి కృపా కటాక్షాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందాలని ఆ దేవదేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమన మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వామివారి చిత్రపటాన్ని అందించారు.