35.2 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. !

నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. !

ఆంధ్రలో డీజిల్, పెట్రోల్ ధరలు బాదుడు ఆపేది ఎన్నడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొంత సామాన్యులపై భారం తగించిదని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన సూచించారు. వసూల్ రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు..? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు..? అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఉద్దేశించి ఆయన సెటైర్లు వేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందని ఆయన తెలిపారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలన్నీ తగ్గించినా వసూల్ రెడ్డికి మాత్రం పెట్రోల్, డీజిల్ పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు మంచి చేయడానికి మనస్సు రావడం లేదున్నారు. ఆస్తిపన్ను పన్ను, కరెంట్ బిల్లు, నిత్యావసరాల,చివరికి చెత్తపైనా పన్నులేసిన మీ బాదుడుకు ధరలు ఆకాశాన్ని అందాయని అన్నారు.దేశమంతా పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో జనంపై సీఎం జగన్మోహన్ కరుణ చూపాలని అన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోంది, లైట్లు వేద్దాం అంటే కరెంటు చార్జీలు షాక్ కొడుతున్నాయి. ఆంధ్రలో దీపావళి పండగ పుట ప్రజల పరిస్థి ఇలా ఉందిన్నారు. నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో.. ! అని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్