హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రాజకీయ పార్టీలు ప్రలోభాల కు తెరదించాయి. స్థానికేతరులు సాయంత్రం 7 నుండి నియోజకవర్గం విడిచి వెళ్లిపోయారు. గురువారం రాత్రి నుండి రాజకీయ పార్టీలు నగదు పంపిణీ పై నాజర్ పెట్టారు, ఈ ఎన్నికలు అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఏలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరోలెక్క, అన్నట్లు ఒక్క ఓటుకు ఐదు వేల నుండి పదివేల వరకు గుట్టుచప్పుడు కాకుండా
ప్రత్యేక కోడ్ భాషను ఎంచుకోని కవర్లో పెట్టి ఇస్తున్నట్లు తెలుస్తుంది..