తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను అంటూ ప్రేమ అనే మహిళ తెరపైకి వచ్చారు. ఇవాళ చెన్నై మెరీనా బీచ్ లో ని జయలలిత సమాధి వద్ద ప్రేమ నివాళులు అర్పించారు. తాను జయలలిత కూతుర్ని అని అనేందుకు కు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు . గతంలో తాను మైసూర్ లో ఉండే దాన్ని ,గత 30 ఏళ్లుగా చెన్నైలోని పల్లవారం లో నివసిస్తున్నానాని ప్రేమ తెలిపారు. త్వరలో శశికళ ను కలవనున్నట్లు పేర్కొన్నారు.