పండగకు ప్రత్యేక రైళ్లు

296

పండగకు ప్రత్యేక రైళ్లు

దీపావళి పండగ పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళ్లే వారికి రైల్వే శాఖ కొత్త రైళ్లు నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్, విశాఖపట్నం నుండితిరుపతిల మధ్య ప్రత్యేక వికీ రైళ్లను నడపనుంది. ఈ రైళ్ల కోసం రిజర్వేషన్ ను ఆశాఖ ప్రారంభించింది నవంబర్ 2 సాయంత్రం 5-35 విశాఖపట్నం బయల్దేరానున్న ప్రత్యేక రైలు (08585) బుధవారం ఉదయం 7-10కి చేరుకుంటుంది అలాగే నవంబర్ 3న రాత్రి 9-05 సికింద్రాబాద్ నుండి బయల్దేరు ప్రత్యేక రైళ్లు (08586) గురువారం ఉదయం 9-50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది దువ్వాడ సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ అ గుంటూరు టూ మిర్యాలగూడ నల్లగొండ రైల్వే స్టేషన్లలో ఆగం ఉంది ఈ స్పెషల్ ట్రైన్లలో ఏసీ టు టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, సెకండ్ క్లాస్ ఉంటాయి. నవంబర్ 1న 7-15 సాయంత్రం విశాఖపట్నం నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్ (08583) మంగళవారం ఉదయం 7-30 తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుండి నవంబర్ 2న మంగళవారం రాత్రి 9-55 బయలుదేరు రైలు (08584) బుధవారం 10 -20 చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగం ఉంది దీపావళి పండగ సందర్భంగా ప్రయాణం చేయదలుచుకున్న వారికి రైల్వే శాఖ మంచి అవకాశం కల్పించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి