పుట్టపాక చీరకు జాతీయస్థాయి గుర్తింపు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక తేలియా రుమాలు డబుల్ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక కు చెందిన చేనేత కళాకారులు కొలను పెద్ద వెంకయ్య, ఆయన కుమారుడు రవీంద్ర సుమారు పది నెలల పాటు శ్రమించి మగ్గం పై వేసిన మీ చేనేత చీర కు జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. రాష్ట్ర ప్రాంతీయ జాతీయ స్థాయిలో మూడు దశల్లో నిపుణు నిపుణుల బృందం పరిశీలించింది.