పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్య నిర్వాహక సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణ ప్రెస్ క్లబ్ లో శనివారం జిల్లాలోని 11 మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా కార్యవర్గము హాజరైయ్యారు. సంఘం అధ్యక్షులు అమ్మన చంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టి ఎస్ జీ అర్ ఈ ఏ) సమస్యల పట్ల ఏ విధంగా పోరాడుతుందో వివరించారు. పెండింగ్ లో ఉన్న మూడు విడతల కరువు భృతి(డి అర్) వెంటనే విడుదల చేయాలన్నారు. నగదు రహిత చికిత్స(ఇ ఏచ్ ఎస్)విధి విధానాలను రూపొందించి వెంటనే అమలు చేయాలని ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు చెల్లించాలని తదితర ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా మండల యూనిట్ల సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాననీ ఎల్ల వేళల అందుబాటులో యుండి సమస్యల సాధనకు కృషిచేస్తానన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ రాజిరెడ్డి కోశాధికారి యన్ బాలయ్య జే. సత్యం తదితులున్నారు పాల్గొన్నారు.