34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణపేరు గొప్ప ఊరు దిబ్బ

పేరు గొప్ప ఊరు దిబ్బ

పేరు గొప్ప ఊరు దిబ్బ

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్ లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,వారిని క్రమబద్దీకరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఐ.ఎఫ్.టి.యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ డిమాండ్ చేశారు గురువారం ప్రగతిశీల కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో కెజిబివి వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కెజిబివి లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వర్కర్ల కు ఈఎస్ఐ,పి.ఎఫ్,వైద్య సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నపుడు,2005 లో కెజిబివి లను ప్రారంభించారని, తెలంగాణ రాష్ట్రములో పెరుగుతున్న ధరల కనుగుణంగా వర్కర్ల వేతనాలు పెంచకుండా,వారిని పర్మినెంట్ చేయకుండా పని భారాన్ని పెంచడమే తప్ప,వర్కర్ లతో గొడ్డు చాకిరీ చేయించడమే పాలకుల విధానంగా మారిందని విమర్శించారు. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం నాన్ టీచింగ్ వర్కర్ లకు 14000 ల నుండి 18000 వేలు కేటగిరీల వారీగా జీతాలు చెల్లిస్తుంటే, తెలంగాణ రాష్ట్రం ధనిక,మిగులు రాష్ట్రమని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్ ప్రభుత్వం,కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్ లకు కేవలం 9750 రూపాయలకే పరిమితం చేశాడని, పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా కేసిఆర్ పాలన తయారైందని మండిపడ్డారు. నాన్ టీచింగ్ వర్కర్ లకు కనీస వేతనం,పర్మినెంట్ చేసే బాధ్యత ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కార్మిక వ్యతిరేక విధానాలలో భాగమేనని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ద్వారా కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురిచేసే విధానం తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్స్ పద్మ కవిత మల్లిక రజిత అరుణ దుర్గమ్మ లావణ్య శెశిరేఖ కవిత శైనజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్