ప్రజల మన్ననలు పొందే విధంగా సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారు మంత్రి గంగుల కమలాకర్
యదార్థవాది ప్రతినిధి కరీంనగర్
ప్రజల మన్ననలు పొందుతూ సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు బదిలీపై వెళుతున్న పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణకు వీడ్కోలు, నూతనంగాబాధ్యతలు చేపట్టిన పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కు స్వాగతం పలుకుతూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ బదిలీపై వెళ్ళిన పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ సమర్ధవంతంగా పనిచేశారన్నారు. దేశానికి ఎంతోమంది మహోన్నతులను అందించడంతోపాటు విభిన్న రకాల కార్యక్రమాలు కొనసాగే కరీంనగర్ లో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని అన్నారు బదిలీపై వెళుతున్న పోలీస్ కమీషనర్ కు మంత్రి ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు వివిధశాఖలకు చెందిన అధికారులు జ్ఞాపికను అందజేసి, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మేల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్లతో పాటుగా డిసిపి ఎస్ శ్రీనివాస్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, వెంకటరెడ్డి, మదన్ లాల్, జె విజయసారధి, కె శ్రీనివాస్, సి.ప్రతాప్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లులతోపాటుగు పలువురు అధికారులు పాల్గొన్నారు.