ప్రభుత్వ ఆసుపత్రి పనులను కేత్ర స్థాయిలో పరిశీలించిన: జిల్లా కలెక్టర్
– అతి త్వరలో ప్రారంబానికి సిద్ధం కావాలి..
– ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ వైద్యం..
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో ఆదివారం క్షేత్ర స్థాయిలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృడ సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టు 1000 పడకల ఆసుపత్రిని అతి త్వరలో ప్రారంభించేందుకు సిద్దం చెయ్యాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న పనులు సైతం వేగంగా పూర్తి చేయ్యాలని ఆసుపత్రిలో పడకలు, ఫర్నీచర్, మార్టిన్స్, కర్టేన్స్ అలాగే ప్రతి డిపార్ట్మెంట్ డెంటాలజి, ఈఎన్జి, పారామెడికల్, ల్యాబ్, ఆప్తామాలజి డాక్టర్ల సిబ్బంది పరికరాలు అన్ని సమకూర్చుకోవాలి ప్రజలకు మెరుగైన వైద్య అందించేందుకు సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ సులభంగా అర్థం అయ్యేలా ప్రతి రూం కి నంబర్లు, పేర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చెయ్యాలని బయట లాన్లో పెద్ద మొక్కలు పెట్టి గడ్డి కార్పెట్ పరచాలి. అన్ని పనులు పూర్తి చేసి పూలదండలతో అందంగా ముస్తాబు చెయ్యాలని అధికారులకు తెలిపారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, డిఎంఈ రమేష్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా. కాశీనాథ్, టిఎస్ ఎంఎస్ఐడిసి ఎండి కె. చంద్రశేఖర్ రెడ్డి, సిఈ రాజేందర్ కుమార్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్, కాంట్రక్టర్ బాపినీడు మెడికల్ కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.