ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఆర్మూర్ యదార్థవాది
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజ గంగారాం కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడుపుతూ సుప్రీంకోర్టు జీవో 91విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్- ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ బుక్స్ ఇలా పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చి బహిర్గతంగా అమ్ముతూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని అయన అన్నారు. ఆర్మూర్ కేంద్రంలో పలు కార్పొరేట్-ప్రైవేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య, నలంద, నారాయణ, బ్రిలియంట్ గ్రామర్, క్షత్రియ, నారాయణ, శ్రీ భాషిత, కృష్ణవేణి, సెంట్ పాల్, ఆల్ ఫోర్సెస్ నియమ నిబంధనలను పాటించకుండా అక్రమంగా డొనేషన్లు, ఫీజులు అధికంగా వసూలు చేయడంతో తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తూ ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అయినా అధికారులు చర్యలు తిసులోవాలని ప్తీరభుత్సువాన్కోని కోరారు..