నందమూరి నట సింహం బాలకృష్ణ తదుపరి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య 105వ సినిమా రాబోతుండగా ఇందులో హీరోయిన్ ను దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఈ మూవీలో బాలయ్య పక్కన శృతిహాసన్ మెరవనున్నటు గోపీచంద్ ట్వీట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.